శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 20:55:07

కేంద్రంతో రైతుల చర్చలు అసంపూర్తి.. 5న మరోసారి భేటీ

కేంద్రంతో రైతుల చర్చలు అసంపూర్తి.. 5న మరోసారి భేటీ

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం గురువారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఈ నెల5న మరోసారి రైతులతో చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను తొలగిస్తారన్న అపోహలో రైతులు ఉన్నారని, దీని గురించే వారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కనీస మద్దతు ధరను కొనగిస్తామన్న భరోసాను రైతుల్లో కలిగిస్తామన్నారు. రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. రైతుల నిరసనలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆందోళన విరమించాలని కోరుతున్నానని నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo