శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 19:26:20

పీకల్లోతు గొయ్యిలో దిగి రైతుల నిరసన..వీడియో

పీకల్లోతు గొయ్యిలో దిగి రైతుల నిరసన..వీడియో

రాజస్థాన్‌:  రాజస్థాన్‌వాసులు తమ సమస్యను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వినూత్నంగా నిరసన చేపట్టారు. జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి అధికారులు హౌసింగ్‌ ప్రాజెక్టు పేరుతో తమ భూములను స్వాధీనం చేసుకున్నారని నిందార్‌ గ్రామస్తులు ‘జమీన్‌ సమాధి సత్యాగ్రాహ’ పేరుతో నిరసన తెలిపారు. 21 మంది రైతులు పీకల్లోతు వరకు గొయ్యిలు తవ్వుకుని అందులోకి దిగి తమ నిరసన తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. భూసేకరణ చట్టం ప్రకారం తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. జనవరిలో కూడా రైతులు నాలుగు రోజులపాటు జమీన్‌ సమాధి సత్యాగ్రాహ నిరసన చేపట్టారు.  ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి 50 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. logo