లండన్: లూయిస్ వైట్టోన్ మోట్ హెన్నెస్సీ (ఎల్వీఎంహెచ్) అధినేత, ఫ్రాన్స్ ఇన్వెస్టర్ బెర్నార్డ్ అర్నాల్ట్, ఆయన కుటుంబం.. ప్రపంచంలోకెల్లా అత్యంత కుబేరుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను దాటేసిన బెర్నార్డ్ అర్నాల్ట్ కొద్దిసేపు ప్రపంచ కుబేరుడిగా కొనసాగారు. ఆ తర్వాత కొన్ని గంటల్లో దాటేసి మళ్లీ జెఫ్ బెజోస్ మొదటి స్థానానికి వచ్చారు.
ఫోర్బ్స్ కథనం ప్రకారం బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద 186.2 బిలియన్ల డాలర్లు. గత 18 నెలల్లో ఆయన సంపద 110 బిలియన్ డాలర్లు వ్రుద్ధి చెందింది. దీంతో మొత్తం ఆయన నికర సంంపద 161.2 బిలియన్ల డాలర్లకు చేరింది.
ఇటీవలే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా ఉన్న టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ స్థానాన్ని బెర్నార్డ్ అర్నాల్ట్ దాటేశారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఫ్యాషన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ.. ఎల్వీఎంహెచ్.. 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 32 శాతం ఆదాయం పెంచుకున్నది అంటే 14 బిలియన్ల యూరోల రెవెన్యూ పెంచుకున్నది.
గత జనవరిలో అమెరికాకు చెందిన అతిపెద్ద జ్యువెల్లరీ తయారీ సంస్థ టిఫానీ అండ్ కో సంస్థను 15.8 మిలియన్ల డాలర్లకు ఎల్వీఎంహెచ్ టేకోవర్ చేసింది. లగ్జరీ ఫ్యాషన్ బిజినెస్‌లోనే ఇది అతిపెద్ద డీల్.
టిఫానీ అండ్ కో టేకోవర్‌తో జ్యువెల్లరీ అండ్ వాచ్ డివిజన్‌తో కూడిన ఎల్వీఎంహెచ్ చిన్న బిజినెస్ పురోభివ్రుద్ధికి తోడ్పాటునిస్తుంది. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా బెర్నార్డ్ అర్నాల్ట్స్ సారధ్యంలోని ఎల్వీఎంహెచ్ 70 బ్రాండ్ల సామ్రాజ్యానికి అధిపతి.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్‌తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్‌కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్‌ల ఉత్పత్తికి వాక్‌హార్డ్ రెడీ.. కానీ?!