రైతు ఆందోళన ఎగదోస్తున్న విపక్షాలు: నిత్యానందరాయ్

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సైన్యానికి నిత్యావసరాలు సరఫరా చేయకుండా విపక్షాలు కుట్ర పన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నాయని ఆదివారం రైతులతో జరిగిన సమావేశంలో అన్నారు.
మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నా విపక్షాలు ఆందోళనను ఎగదోస్తున్నాయని పేర్కొన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీని ఆయన పునరుద్ఘాటించారు. భారత రైతుల కోసమే ప్రధాని నరేంద్రమోదీ తన విజన్ ఆధారంగా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.