గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 02:24:03

అన్నదాత ఆగ్రహం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా

అన్నదాత ఆగ్రహం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా

  • నవంబర్‌ 5న దేశవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం
  • 26-27 తేదీల్లో ‘చలో ఢిల్లీ ’  
  • 500 రైతుల సంఘాల ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరాటం తీవ్రతరం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. రైతు వ్యతిరేక విధానాలను దునుమాడేందుకు దేశంలోని నలుమూలల్లో ఉన్న దాదాపు 500 రైతుల సంఘాలు ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. వచ్చేనెల 5న దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు ప్రకటించాయి. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద ‘ఎలక్ట్రిసిటీ (సవరణ) బిల్లు-2020ను వెంటనే ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీచేశాయి. ఏఐకేఎస్‌సీసీ నేతృత్వంలో రైతు సంఘాల నేతలు ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. నవంబర్‌ 5న రాస్తారోకోలతోపాటు అదే నెల 26 నుంచి 27వరకు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిస్తూ తీర్మానం చేసినట్టు ఏఐకేఎస్‌సీసీ ఓ ప్రకటనలో తెలిపింది. రైతుల ఉద్యమాన్ని సమన్వయం చేసేందుకు బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, గుర్నామ్‌సింగ్‌, వీఎం సింగ్‌, రాజు షెట్టి, యోగేంద్రయాదవ్‌తో కమిటీని ఏర్పాటుచేశారు. 

పల్లె నుంచి పట్నానికి కదం తొక్కాలె

రాస్తా రోకో కార్యక్రమంలో వేలమంది రైతులు పాల్గొనేలా సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ రైతు నేతలు కమిటీలుగా ఏర్పడి రైతులకు మార్గదర్శనం చేయాలని జాతీయ నేతలు సూచించా రు. రాస్తారోకోలతోపాటు కేంద్రప్రభుత్వ కార్యాలయా లు, అధికార బీజేపీ నేతల ఆఫీసుల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అనుకూల కార్పొరేట్‌ కంపెనీల ముందు కూడా నిరసన తెలుపాలని సంఘాలు నిర్ణయించాయి. ‘రైతుల ఆందోళన పేరు చెప్పి పంజాబ్‌కు గూడ్సురైళ్లు వెళ్లకుం డా కేంద్రం నిలిపివేయటానికి ఖండిస్తున్నాం. ప్రభుత్వ చర్య పంజాబ్‌ రైతులు, ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేయటమే. ప్రజాస్వామ్య దేశంలో ఇది అత్యంత దురదృష్టకరమైన విధానం’ అని ఏఐకేఎస్‌సీసీ మండిపడింది.