వ్యక్తిగత బాండ్ల కోసం రైతులకు నోటీసులు

లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆరుగురు రైతులకు ఉత్తరప్రదేశ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తొలుత రూ.50 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని కోరిన అధికారులు అనంతరం దానిని రూ.50 వేలకు సవరించారు. భారతీయ కిసాన్ యూనియన్ (అస్లీ) జిల్లా అధ్యక్షుడు రాజ్‌పాల్ సింగ్ యాదవ్, రైతు నాయకులు జైవీర్ సింగ్, బ్రహ్మచారి యాదవ్, సతేంద్ర యాదవ్, రౌదాస్, వీర్ సింగ్‌కు ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దీపేంద్ర యాదవ్ తెలిపారు. కొంత మంది వ్యక్తులు రైతులను ప్రేరేపిస్తున్నారని, శాంతి భద్రతల ఉల్లంఘన జరుగవచ్చని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి తమకు నివేదిక వచ్చిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తొలుత రూ.50 లక్షల వ్యక్తిగత బాండ్లను రైతుల నుంచి కోరగా వారు అభ్యంతరం చెప్పడంతో రూ.50 వేలకు తగ్గించినట్లు వివరించారు.
మరోవైపు తాము శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నామని, ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భారతీయ కిసాన్ యూనియన్ (అస్లీ) జిల్లా అధ్యక్షుడు రాజ్‌పాల్ సింగ్ యాదవ్ తెలిపారు. దీంతో తాము వ్యక్తిగత బాండ్లు సమర్పించబోమని చెప్పారు. మమల్ని ఉరి తీసినా లేదా జైలుకు పంపినా సరే రైతు హక్కుల పోరాటంపై వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- బీజేపీ బోగస్ మాటలను నమ్మొద్దు : మంత్రి ఎర్రబెల్లి
- గంగానది ప్రశాంతత మంత్రముగ్ధం : ఎమ్మెల్సీ కవిత
- 'విరాటపర్వం' విడుదల తేదీ ఖరారు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..