శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 15:22:11

ట్యాంకర్‌ పాలు.. రోడ్డుపై పారబోశారు

ట్యాంకర్‌ పాలు.. రోడ్డుపై పారబోశారు

ముంబై : పాలను రోడ్డుపై పారబోస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ట్యాంకర్‌ను రోడ్డుపై ఆపి.. కొందరు వాల్వ్‌ తెరగా పాలన్నీ రోడ్డుపై పారగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. ఈ ఘటన బెంగళూరు - పుణె రహదారిపై మంగళవారం జరిగింది. కాగా, మహారాష్ట్రకు చెందిన పలువురు పాడి రైతులు ధర పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టినట్లు తెలుస్తోంది. వీడియోలో ఉన్నది స్వాభిమాన్‌ షెట్కారీ సంఘటన్‌ అనే రైతు సంస్థకు చెందిన సభ్యులు. ‘ఆవు పాల కనీస రేటు, ఇతర వస్తువులతో కలిపి లీటరుకు రూ.25 చొప్పున ఇవ్వాలని వీరు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పాల ధర పెంపుతో సహా పలు డిమాండ్లు పరిష్కరించాలంటూ మంగళవారం పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లి, కొల్లాపూర్ జిల్లాల్లో ఆందోళనను ప్రారంభించారు.

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్లు ఈ డిమాండ్ల వెనుక కారమణమన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలను ఉధృతం చేయాలని కూడా రైతు సంఘం నిర్ణయించింది. ఆందోళనకారులు రాజు శెట్టి నేతృత్వంలోని స్వాభిమాన్‌ షెట్కారీ సంఘటన్‌ పాల ట్యాంకర్లను ఆపి, రెండు జిల్లాల మీదుగా పుణె-బెంగళూరు రహదారిపై పారబోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాల ధర లీటర్‌కు రూ.5 పెంచాలని, పాల ఉత్పతిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ‘పాల ఉత్పత్తిదారులకు రూ.30 ఎగుమతి రాయితీని, పాల ఉత్పత్తులపై విధించే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo