శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 17:36:12

కేంద్రం ఆర్డినెన్స్‌లపై పంజాబ్ రైతుల నిరసన

కేంద్రం ఆర్డినెన్స్‌లపై పంజాబ్ రైతుల నిరసన

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతు సంబంధ ఆర్డినెన్స్‌లపై పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైరఖరిని ఖండిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమృత్‌సర్‌లో రైతులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరనన ప్రదర్శనలో పాల్గొన్న రైతులు భౌతిక నిబంధన పాటించకపోగా కొందరు మాస్కులు కూడా ధరించలేదు.

మరోవైపు రైతుల నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. పలుచోట్ల రహదారులను మూసివేశారు. రైతుల ఉత్పత్తి, వాణిజ్యం, రైతుల సాధికారత, రక్షణతోపాటు మద్దతు ధరలకు భరోసా, వ్యవసాయ సేవలకు సంబంధించిన మూడు ఆర్డినెన్స్‌లను ఉత్తర భారతదేశంలోని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
logo