బుధవారం 27 జనవరి 2021
National - Dec 25, 2020 , 16:51:49

జియో టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయించిన రైతులు

జియో టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయించిన రైతులు

చండీగఢ్‌ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు పంజాబ్‌లోని మన్సాలో రిలయన్స్‌ జియో టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో టెలికం దిగ్గజం సేవలకు అంతరాయం కలిగించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు అవతార్‌ సింగ్‌ మాట్లాడుతూ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు విద్యుత్‌ సరఫరా చేసే వరకు జియో, రిలయన్స్‌లను బహిష్కరిస్తూనే ఉంటామన్నారు. అందరు దీనికి మద్దతు ఇస్తున్నామని, కార్పొరేట్ల ప్రయోజనానికే మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు హర్యానాలో చాలా రహదారులపై టోల్‌ వసూళ్లను శుక్రవారం నిలిపివేయించారు.

వేకువ జాము నుంచి రాష్ట్రంలోని అనేక టోల్‌ పాయింట్ల వద్ద టోల్‌ వసూలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రైతులు టోల్‌ ప్లాజాలను ఆధీనంలోకి తీసుకొని.. ప్రయాణికుల నుంచి ఫీజు వసూలు చేయడానికి సిబ్బందిని అనుమతించలేదు. దీంతో టోల్‌ ప్లాజా ఉద్యోగులు ఎలాంటి చార్జీ చెల్లించకుండా వాహనాలను ప్రయాణించడానికి అనుమతించారు. బీకేయూ ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హర్యానాలో టోల్‌ బూత్‌లలో టోల్‌ వసూలు చేయనివొద్దని పిలుపునిచ్చింది. కర్నాల్‌లోని బస్తారా ఎన్‌హెచ్‌-44పై, కర్నాల్‌ జింద్‌ హైవే, సిర్సా జిల్లాలోని దబ్వాలి, ఖుయాన్‌ మాల్కానా, రోహ్తక్‌ - పానిపట్‌ హైవేలోని మౌక్రౌలి కలాన్‌ వద్ద రైతులు టోల్‌ వసూళ్లను నిలిపివేయించారు.logo