శనివారం 05 డిసెంబర్ 2020
National - Sep 20, 2020 , 16:42:11

రైతులకు మిఠాయిలు తినిపించిన కేంద్ర మంత్రి తోమర్

రైతులకు మిఠాయిలు తినిపించిన కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పలువురు రైతులకు మిఠాయిలు తినిపించారు. ఆదివారం రాజ్యసభలో ఆయన ప్రవేశపెట్టిన అగ్రి బిల్లులను గందరగోళం మధ్య వాయిస్ ఓటు ద్వారా డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆమోదింపచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లులకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపినట్లయ్యింది. ఈ నేపథ్యంలో కొన్ని రైతు సంఘాలు ఢిల్లీ విజయ్ చౌక్‌లోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోమర్ పలువురు రైతులకు మిఠాయిలు తినిపించారు. 70 ఏండ్లుగా రైతులు అనుభవిస్తున్న అన్యాయం నుంచి వారికి విముక్తి లభించిందని చెప్పారు. ఇప్పటి వరకు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మండీలో అన్యాయమైన ధరలకు అమ్మవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు వారు సొంతంగా నిర్ణయించిన ధరలకు వాటిని అమ్మ్ముకోవచ్చని చెప్పారు. కనీక మద్దతు ధరలు ఉంటాయన్న తోమర్, ఈ రోజు చారిత్రాత్మక రోజని అన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.