శనివారం 16 జనవరి 2021
National - Jan 14, 2021 , 07:59:49

కొత్త వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం

కొత్త వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం

లక్నో : కొత్త వ్యవసాయ చట్టాలకు చెందిన ప్రతులను రైతులు తగులబెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా, మహోబా జిల్లాల్లో చోటు చేసుకుంది. చట్టాలను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. బుందేల్‌ఖండ్ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు విమల్ కుమార్ శర్మ నేతృత్వంలో రైతులు బండా జిల్లా ప్రధాన కార్యాలయంలోని అశోక్ లాట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి, చట్టాల ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి కొత్త చట్టాల అమలుపై స్టే ఇచ్చినా.. నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు తప్ప.. రైతులు మరేం కోరుకోవడం లేదన్నారు. మహోబాలో, సదార్ తహసీల్ కార్యాలయంలో భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా యూనిట్ వైస్ ప్రెసిడెంట్ హరిహర్ దీక్షిత్ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం చట్టాల ప్రతులను దహనం చేశారు.