e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News అత్యాచార ఆరోప‌ణ‌లు.. మాజీ మంత్రి అరెస్ట్‌

అత్యాచార ఆరోప‌ణ‌లు.. మాజీ మంత్రి అరెస్ట్‌

అత్యాచార ఆరోప‌ణ‌లు.. మాజీ మంత్రి అరెస్ట్‌

బెంగ‌ళూరు: విదేశీ మ‌హిళ‌ను అత్యాచారం చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మ‌ణికంద‌న్‌ను ఆదివారం ఉద‌యం త‌మిళ‌నాడు పోలీసులు బెంగ‌ళూరులో త‌మ ఆదీనంలోకి తీసుకున్నారు. ఆయ‌న‌పై మ‌లేషియాకు చెందిన ఓ మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ‌టంతోపాటు గ‌ర్భస్రావం, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు మ‌ణికంద‌న్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బెంగ‌ళూరులో ఉంటున్న మాజీ మంత్రిని చెన్నై న‌గ‌ర పోలీసులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు.

అన్నాడీఎంకే పార్టీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న మ‌ణికంద‌న్ 2017 మే నెల‌లో ఓ మ‌లేషియా న‌టిని త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేశాడు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆ న‌టితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అత్యాచార ఆరోప‌ణ‌లు.. మాజీ మంత్రి అరెస్ట్‌
అత్యాచార ఆరోప‌ణ‌లు.. మాజీ మంత్రి అరెస్ట్‌
అత్యాచార ఆరోప‌ణ‌లు.. మాజీ మంత్రి అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement