ఆదివారం 24 జనవరి 2021
National - Dec 03, 2020 , 15:47:03

కేంద్ర ప్ర‌భుత్వం భోజ‌నం మాకొద్దు : ‌రైతులు

కేంద్ర ప్ర‌భుత్వం భోజ‌నం మాకొద్దు : ‌రైతులు

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో గురువారం రెండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, నరేంద్ర సింగ్‌ తోమర్ క‌లిసి‌ 40 సంఘాలకు చెందిన రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

అయితే లంచ్ స‌మ‌యంలో ప్ర‌భుత్వం వారికి భోజ‌న ఏర్పాట్లు చేసింది. కానీ రైతులు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన భోజ‌నాన్ని తిర‌స్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం అందించే భోజ‌నం, చాయ్‌ల‌ను అంగీక‌రించ‌మ‌ని తెలిపారు. తాము ఇంటి నుంచి భోజ‌నం తెచ్చుకున్నామ‌ని రైతు సంఘాల నేత‌లు స్ప‌ష్టం చేశారు. 

ఈ నెల 1న జరిగిన సమావేశంలో రైతుల అనుమానాలు, సందేహాల నివృత్తి కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరోదానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. మరో వైపు రైతుల ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. 


logo