ఆదివారం 07 జూన్ 2020
National - Mar 31, 2020 , 16:08:53

రూ. కోటి విలువైన భూమి పేద‌ల‌కు దానం!

రూ. కోటి విలువైన భూమి పేద‌ల‌కు దానం!

మ‌న‌కు కొంత జాగా ఉంటే దానికి మ‌రికొంత క‌లిపి  భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించాల‌ని చూస్తాం. అలాంటిది కోటి రూపాయ‌ల విలువైన కొబ్బ‌రితోట‌.. ఏటా ల‌క్ష‌ల్లో సంపాద‌న. అంత‌టి విలువైన స్థ‌లాన్ని పేద‌ల కోసం పంచాల‌నుకున్నాడో వ్య‌క్తి.మెల్లం సుబ్బారావుది కాకినాడ స‌మీపంలోని యానాం ప‌రిధిలోని ద‌రియాల‌తిప్ప‌. ఆయ‌న గ‌తంలో వార్డు కౌన్సిల‌ర్‌గా ప‌నిచేశారు. ఎంతోమంది పేద‌లు ఇళ్లు లేక ఇబ్బంది ప‌డ‌డం గ‌మ‌నించాడు. త‌న‌కున్న కొబ్బ‌రి తోట‌ను పేద‌ల‌కు పంచాల‌నుకున్నాడు. రూ. కోటి విలువ చేసే భూమిని ప్లాట్లుగా మార్చాడు. స్వ‌గ్రామంలోని 54 మంది ఇండ్లు, స్థ‌లాలు లేని నిరుపేద‌ల‌ను ఎంపిక‌చేసి వారికి ప్లాట్లు అంద‌జేశాడు.  ఆయ‌న దాతృత్వానికి అంద‌రూ స‌లాం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి మెల్లం సుబ్బారావు కాల‌నీగా నామ‌క‌ర‌ణం చేశారు.


logo