సింగు సరిహద్దులో రైతు ఆత్మహత్య

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా న్యూఢిల్లీ - హర్యానా సరిహద్దులో సింగు వద్ద ఆందోళన చేస్తున్న ఓ రైతు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన అమరీందర్ సింగ్ (40)గా గుర్తించారు. సదరు రైతు గత కొద్ది రోజులుగా వందలాది మంది రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొంటున్నాడు. శనివారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసిన పడుకున్నాడు.. అనంతరం విషం తాగాడు. వెంటనే గమనించిన తోటి రైతులు అతన్ని వెంటనే ఫిమ్స్ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన చావుతోనైనా రైతుల ఆందోళన విజయవంతం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు సదరు రైతు చెప్పాడు. కాగా, సదరు రైతు కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి సింగు సరిహద్దులోనే ఆందోళనకారులకు మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిగినా కొలిక్కి రావడం లేదు. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇండ్లకు వెళ్లిపోతామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. అయితే చట్టాల రద్దు మినహా మరే డిమాండ్లపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించింది. దీంతో ఎనిమిదిసార్లు చర్చలు జరిగినా ప్రతిష్టంభన వీడడం లేదు. ఈ నెల 15న మరోసారి కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగనున్నాయి.
తాజావార్తలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
- రైతుల నిరసనను ఖండించిన మాయావతి
- బోల్తాపడ్డ డీసీఎం.. 70 గొర్రెలు మృతి
- కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్