మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 25, 2020 , 16:06:04

వ్యవసాయ బిల్లులను మహారాష్ట్రలో అమలు చేయబోం: అజిత్‌ పవార్‌

వ్యవసాయ బిల్లులను మహారాష్ట్రలో అమలు చేయబోం: అజిత్‌ పవార్‌

ముంబై: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను మహారాష్ట్రలో అమలు చేయబోమని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ బిల్లులపై చర్చించినట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ బిల్లుల వల్ల తమకు లాభం లేదని రైతులు భావిస్తున్నారని, అందుకే వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అజిత్‌ పవార్‌ అన్నారు. వ్యవసాయ బిల్లులను హడావుడిగా పార్లమెంట్‌లో ఆమోదించాల్సిన అవసరం ఏమున్నదని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లులను రాష్ట్రంలో అమలు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు అజిత్‌ పవార్‌ తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పంజాబ్‌లో బంద్‌ పాటించారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి