మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 07:34:27

మరో 4 వారాలు అప్రమత్తంగా ఉండండి: ఎఫ్‌ఏఓ

మరో 4 వారాలు అప్రమత్తంగా ఉండండి: ఎఫ్‌ఏఓ

న్యూఢిల్లీ: పంటలపై మిడుతల దండు దాడి చేసే విషయమై అప్రమత్తంగా ఉండాలని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) భారత్‌ను కోరింది. గతంలో 26 ఏండ్ల క్రితం దేశంపై భారీసంఖ్యలో మిడుతలు దాడిచేశాయి. మళ్లీ ఇప్పుడు భారత్‌ ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. తాజాగా ఇరాన్‌, పాకిస్థాన్‌ నుంచి భారత్‌-పాక్‌ సరిహద్దుల మీదుగా ఉత్తరాది రాష్ర్టాలపై దాడి చేసేందుకు మిడుతల దండు దూసుకొస్తున్నది. 

మరోవైపు పంటలపై మిడుతల దాడిని నివారించేందుకు ప్రభుత్వం డ్రోన్లు, బెల్‌ హెలికాప్టర్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. దేశంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, బీహార్‌ రాష్ర్టాల్లో మిడుతల దాడి ప్రభావం అధికంగా ఉన్నది. 


logo