బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 13:51:53

బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్‌ స్పందన

బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్‌ స్పందన

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచన్‌ హోస్ట్‌ చేస్తున్న టీవీ షో కౌన్‌బనేగా కరోడ్‌పతి నుంచి ఓ స్పెషల్‌ వీడియోను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థిక సలహాదారు గీతా గోపీనాథ్‌ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో గీతా గోపీనాథ్‌ను అమితాబ్‌ ప్రశంసలు కురిపిస్తూ కనిపించారు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ను ఉద్దేశించి  స్ర్కీన్‌పై డిస్‌ప్లే అయిన ఫోటోను చూపుతూ ‘ ఈ ఫోటోలో కనిపించే ఆర్థిక వేత్త 2019 నుంచి ఏ సంస్థకు చీఫ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్నార’ని ప్రశ్నించారు.

అందమైన ముఖాకృతి కలిగిన ఆమెను ఆర్థిక రంగానికి చెందినవారని ఎవరూ అనుకోరనీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను గీతా గోపీనాథ్‌ ట్వీట్‌ చేస్తూ తాను అమితాబ్‌కు గొప్ప అభిమానినని ఇది తనకు ప్రత్యేకమైన వీడియో అని చెప్పుకొచ్చారు. మరోవైపు అమితాబ్‌ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడ్డారు. సామర్థ్యం విస్మరించి, మహిళ అందంపై ప్రశంసలు గుప్పించడం సరైంది కాదని దుయ్యబట్టారు.

VIDEOS

logo