గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 18:49:45

ఫేమస్‌ ‘టుండే కబాబి’ ఓపెన్‌

ఫేమస్‌ ‘టుండే కబాబి’ ఓపెన్‌

లక్నో : లక్నోలోని ఫేమస్‌ టుండే కబాబీ రెస్టారెంట్‌ మూడు నెలల లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి ఆదివారం తెరుచుకుంది. ఈ సందర్భంగా రెస్టారెంట్‌ యజమాని మహ్మద్‌ ఉస్మాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతానికి గేదె మాంసం దొరకడం లేదు.. కాబట్టి మటన్‌, చికెన్‌ కబాబ్‌లను మాత్రమే చేస్తున్నట్లు తెలిపాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కబాబ్‌లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. మొదటి రోజు కావడంతో తక్కువ మొత్తంలో కబాబ్‌లు చేశామని ప్రస్తుతానికి గిరాక్‌ బాగానే ఉందని పేర్కొన్నాడు. రెస్టారెంట్‌ ఓపెన్‌ అయిందని తెలియడంతో కబాబ్‌ ప్రియులు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. 
logo