బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 20:11:41

ప్రముఖ సాధువు శోభన్‌ సర్కార్‌ కన్నుమూత

ప్రముఖ సాధువు శోభన్‌ సర్కార్‌ కన్నుమూత

లక్నో : ప్రముఖ సాధువు, స్వామి విరక్త్‌ ఆనంద్‌ జీ మహారాజ్‌  అలియాస్‌ శోభన్‌ సర్కార్‌ కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కన్పూర్‌ జిల్లా శివ్‌లీ ప్రాంతంలో ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. స్వామి శోభన్‌ సర్కార్‌ ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) చర్యతో దేశవ్యాప్త ప్రాచుర్యంలోకి వచ్చారు. సాధువు కలను విశ్వసించి ఏఎస్‌ఐ 2013లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లా ధుండియా ఖేరా గ్రామంలో బంగారు గనుల కోసం తవ్వకాలు జరిపింది. ఈ శ్రమంతా నిష్పలంగా మిగిలిన సంగతి తెలిసిందే. సాధువు పార్ధీవదేహాన్ని చూసేందుకు స్థానికంగా వేల సంఖ్యలో అతని అనుచరులు ఆశ్రమానికి చేరుకున్నారు.  


logo