ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 17:49:11

కరోనా వైరస్ తో కన్నుమూసిన కవి

కరోనా వైరస్ తో కన్నుమూసిన కవి

ఇండోర్ : కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ ప్రముఖ కవి రాహత్ ఇందౌరి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 70 ఏళ్ల రాహత్ ఇందౌరి ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా ట్వీట్ చేశాడు. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న కవి.. కరోనాతో జరిగిన యుద్ధంలో ఓటమి పాలయ్యాడు.

ఊపిరితిత్తులలో న్యుమోనియా కారణంగా ఐసీయూలో రాహత్ ఇందౌరిని ఆయన కుమారులు ఇండోర్ లోని దవాఖానలో చేర్చారు. నాలుగైదు రోజుల క్రితం కాస్త ఇబ్బందికి గురవుతుండటం గుర్తించి ఊపిరితిత్తుల ఎక్స్‌రే తీసినప్పుడు న్యుమోనియాగా వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆయన నమూనాలను కరోనా పరీక్షల కోసం పంపాగా పాజిటివ్ గా తేలింది. రాహత్‌కు గుండె జబ్బు, మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయి. 

చికిత్స సమయంలో తనకు చాలా సమస్యలు బయటపడ్డాయని అరబిందో హాస్పిటల్ డైరెక్టర్ వినోద్ భండారి చెప్పారు. ఇందులో పైలేటర్ న్యుమోనియా, కొవిడ్ పాజిటివ్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. తీవ్రమైన శ్వాససంబంధ సమస్యతో బాధపడిన రాహత్ ఇందౌరీ చివరకు తుదిశ్వాస విడిచారు.


logo