మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 18:20:13

ఇది సోషల్‌ డిస్టాన్స్‌ హల్దీ సెర్మనీ!ఎలా చేసుకున్నారంటే..

ఇది సోషల్‌ డిస్టాన్స్‌ హల్దీ సెర్మనీ!ఎలా చేసుకున్నారంటే..

హైదరాబాద్‌: కొవిడ్‌-19 వల్ల భౌతిక దూరం తప్పనిసరైంది. శుభకార్యాలు, అంతిమయాత్రలు.. ఇలా ఏకార్యక్రమమైనా కొద్దిమందితో దూరందూరంగా ఉంటూ నిర్వహిస్తున్నారు. మరి భారతదేశంలో వివాహాల సందర్భంగా జరుపుకునే హల్దీ సెర్మనీని భౌతిక దూరం పాటిస్తూ జరుపుకోవడం ఎలా? అని ఆలోచించిన ఓ కుటుంబం వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. ఈ ఉల్లాసభరితమైన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నది.

పాయల్ భయానా అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తల్లి తన కుమార్తెపై పెయింట్‌ రోలర్‌ ఉపయోగించి పసుపు రాస్తోంది. మీడియం-సైజ్ కంటైనర్‌లో పసుపును ఉంచారు. ఒక్కొక్కరూ వచ్చి పెయిట్‌రోలర్‌తో వధువుకు పసుపు పూశారు. దీన్ని ‘సోషల్‌ డిస్టాన్స్‌ హల్దీ సెర్మనీ’ శీర్షికతో పోస్ట్‌ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంది. దీనికి 465 రీట్వీట్లు, 2,300 లైక్స్‌ వచ్చాయి. ఇప్పటివరకూ 42,600 మంది వీక్షించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo