శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 16:18:51

అబ్దుల్ క‌లామ్ స్మార‌క స‌మాధి వ‌ద్ద కుటుంబ స‌భ్యుల నివాళి

అబ్దుల్ క‌లామ్ స్మార‌క స‌మాధి వ‌ద్ద కుటుంబ స‌భ్యుల నివాళి

చెన్నై: మాజీ రాష్ట్ర‌ప‌తి, భారతరత్న డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లామ్ 5వ వ‌ర్థంతి నేప‌థ్యంలో సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళి అర్పించారు. దేశానికి క‌లామ్ చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. సొంత ఊరైన త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో క‌లామ్ స్మార‌క స‌మాధి వ‌ద్ద ఆయ‌న కుటుంబ స‌భ్యులు నివాళి అర్పించారు. 

1931 అక్టోబ‌ర్ 15న జ‌న్మించిన అవూల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం సుమారు 40 ఏండ్ల పాటు భార‌త అంత‌రిక్ష , ర‌క్ష‌ణ రంగ ప‌రిశోధ‌న‌ల్లో కీల‌క పాత్ర పోషించారు. ప‌లు రాకెట్ల త‌యారీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో అబ్దుల్ క‌లామ్‌ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2002 నుంచి 2007 వ‌ర‌కు దేశ 11వ రాష్ట్ర‌ప‌తిగా ఉన్నారు. 

జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగా ఉన్న అబ్దుల్ క‌లామ్ 2015 జూలై 27న 83 ఏండ్ల వ‌య‌సులో షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్ర‌సంగిస్తూ కుప్ప‌కూలిపోయి మ‌ర‌ణించారు. 40 యూనివ‌ర్సిటీల నుంచి గౌర‌వ డాక్ట‌రేట్లు, 1981లో ప‌ద్మ‌భూష‌ణ్‌, 1990లో పద్మ వి‌భూష‌ణ్ పుర‌స్కారాలు అందుకున్న అబ్దుల్ క‌లామ్‌ను 1997లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో భార‌త ప్ర‌భుత్వం గౌర‌వించింది.logo