బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 13:42:29

కరోనా చికిత్స పేరిటి మోసం.. నకిలీ వైద్యులు అరెస్టు

కరోనా చికిత్స పేరిటి మోసం.. నకిలీ వైద్యులు అరెస్టు

తమిళనాడు : కరోనా చికిత్స పేరుతో మోసగిస్తున్న ముగ్గురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని రాణీజేట్‌ జిల్లా అరక్కోణంలో చోటుచేసుకుంది. అన్నామలై, అరుల్‌దాస్‌, పండరీనాథన్‌ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అన్నామలై మందుల దుకాణం ధ్రువపత్రంతో క్లినిక్‌ నడుపుతున్నాడు. పదో తరగతి చదివిన అరుల్‌దాస్‌ వైద్యుడిగా చలామణి అవుతుండగా.. పండరీనాథన్‌ సిద్ధ వైద్యం నేర్చుకుని అలోపతి వైద్యుడిగా చలామణి అవుతున్నాడు.


logo