శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 08:11:27

దొంగ‌నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు ర‌ట్టు

దొంగ‌నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు ర‌ట్టు

గువాహటి: అసోం కేంద్రంగా ప‌నిచేస్తున్న నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాష్ట్ర‌రాజ‌ధాని గువాహటిలోని దిస్పూర్ ప్రాంతంలో ఉన్న‌ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అపార్టుమెంట్‌లో కొందరు వ్యక్తులు దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే స‌మాచారంతో క్రైంబ్రాంచ్ పోలీసులు దాడిచేశారు. ఈ సంద‌ర్భంగా  అపార్టుమెంటులోని ఓ ఇంట్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఘ‌ట‌నా స్థ‌లంలో నకిలీ నోట్ల కట్టలతోపాటు ప్రింటింగ్‌ మిషన్, ఏటీఎం కార్డులు, 14 మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. నిందితుల‌ను నిజాం ఉద్దీన్, హమీద్ అలీ, నజరుల్ హుసేన్, అఫ్జలూర్ రహమాన్‌గా గుర్తించారు. వారంతా ఇస్లాంపూర్‌, అహ్మద్‌పూర్ ప్రాంతాలకు చెందినవారిగా తెలిపారు. నిందితుల‌పై కేసు నమోదు చేశామని, చ‌ట్ట‌ప్ర‌కారం వారికి శిక్ష విధిస్తామ‌ని వెల్ల‌డించారు.