శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 07:07:34

భారత మీడియాపై నేపాల్‌ ఫిర్యాదు

భారత మీడియాపై  నేపాల్‌ ఫిర్యాదు

కఠ్మాండు: తమ దేశానికి వ్యతిరేకంగా భారత మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని నేపాల్‌ వివేశాంగశాఖ ఆరోపించింది. నేపాల్‌ ప్రధాని, అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రచండ తదితర సీనియర్‌ రాజకీయ నేతలతో చైనా రాయబారి ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహించారు. భారత భూభాగాలను కలుపుకొంటూ నేపాల్‌ కొత్త మ్యాప్‌కు ఆమోదం తెలుపడం, భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి విమర్శలు చేస్తున్న నేపథ్యలో ఈ సమావేశాలు నిర్వహించారు. 

అయితే, ఈ సమావేశాలపై భారత మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదని భారత విదేశాంగశాఖకు నేపాల్‌ విదేశాంగశాఖ లేఖరాసింది. భారత విదేశాంగశాఖ అధికారులవద్ద నేపాల్‌ రాయబారి నీలాంబర్‌ ఆచార్య తన నిరసనను కూడా వ్యక్తంచేసినట్టు తెలిసింది. నేపాల్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్లు ఈ నెల 9నుంచి భారత టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపేశారు.


logo