రూ.42 వేల ట్రాఫిక్‌ జరిమానాలు.. బండిని పోలీసులకు అప్పగించిన యజమాని

Oct 31, 2020 , 21:28:33

బెంగళూరు : ఏదైనా వాహనం ఒకటి, రెండు సార్లు.. మహా కాదనుకుంటే నాలుగు సార్లు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు జరిగినవి మనం చూస్తున్నాం. నాలుగు సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంగించినందుకే మన హైదరాబాద్‌ పోలీసులు సదరు వాహనం యజమాని ఫోనుకు నోటీసులు పంపిస్తున్నారు. బెంగళూరులోనైతే ఎంచక్కా ఎన్నైనా ఉల్లంఘనలు చేసుకోవచ్చు. కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి వాహనం ఏకంగా 77 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంట. దాంతో ఆ వ్యక్తికి రూ.42 వేల జరిమానా విధించారు. దాంతో ఆ జరిమానాను చెల్లించేలేనంటూ తన బైక్‌ను పోలీసులకు అప్పగించి నడుస్తూ వెళ్లిపోయాడు.

బెంగళూరు నగరంలో కూరగాయలు విక్రయిస్తూ జీవించే అరుణ్‌కుమార్ అనే వ్యక్తి సెకండ్‌ హ్యాండ్‌ బైకును రూ.20 వేలకు కొనుగోలు చేశారు. అయితే ఈ వాహనం దాదాపు 77 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంట. దాంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆయనకు రూ.42 వేల జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు అతడని ఆపి చెక్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్‌ వాహనంపై రూ.42,500 జరిమానా పెండింగ్‌లో ఉన్నదని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. రూ.20 వేలకు కొనుగోలు చేసిన బైకుకు రూ.42,500 జరిమానా విధించడంతో.. కుమార్ తన వాహనాన్ని మాడివాలా ట్రాఫిక్ పోలీసులకు అప్పగించేసి వెళ్లిపోయాడు.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు రావాల్సిన చలాన్లు / జరిమానాలు రూ.150 కోట్ల వక్ె పెండింగ్‌లో ఉన్నాయని ఒక నివేదిక పేర్కొన్నది. డ్రైవర్ మొదటి రోజున పెండింగ్‌లో ఉన్న 11,488 కేసులను అధికారులు క్లియర్ చేయగా.. రూ.49 లక్షల జరిమానా వసూలు చేశారు. కలెక్షన్ డ్రైవ్ రెండవ రోజు అక్టోబర్ 22 న మరో 7,978 కేసులను క్లియర్ చేసి.. మరో రూ.34 లక్షల జరిమానా వసూలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD