గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 17:35:26

ఫేస్‌బుక్‌లో 5 కోట్ల తప్పుడు పోస్ట్‌లు

ఫేస్‌బుక్‌లో 5 కోట్ల తప్పుడు పోస్ట్‌లు

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలై లాక్‌డౌన్‌ ప్రారంభించినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలకు అంతేలేకుండా పోతుంది. ముఖ్యమంత్రులు, పోలీసులు ఎంత చెప్తున్నా తప్పుడు పోస్టింగ్‌ల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. దాంతో ఫేస్‌బుక్‌ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు తప్పుడు సమాచారం ఉన్న దాదాపు 5 కోట్ల పోస్టులను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ స్పష్టంచేసింది. అంతేకాకుండా, స్వతంత్ర ప్రతిపత్తిగల నిపుణుల సూచనల మేరకు దాదాపు 7,500 ఆర్టికల్స్‌ కూడా తప్పించామని పేర్కొన్నది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు, క్రిమిసంహారక కిట్లు, కొవిడ్‌-19 నిర్ధారణ వస్తు సామగ్రి అమ్మకానికి సంబంధించిన దాదాపు 25 లక్షల పోస్టులను ఎత్తివేశామని వెల్లడించింది. 50 కి పైగా భాషల్లో సమాచారాన్ని సమీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా నిజ తనిఖీ సంస్థలతో ఫేస్‌బుక్‌ పనిచేస్తున్నది.


logo