సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 20:29:36

క‌రోనాకు అగ్గువ ట్యాబ్లెట్ మాదే: గ‌్లెన్‌మార్క్‌

క‌రోనాకు అగ్గువ ట్యాబ్లెట్ మాదే: గ‌్లెన్‌మార్క్‌

న్యూఢిల్లీ: కరోనా బాధితులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులన్నింటిలో ఫాబిఫ్లూ ట్యాబ్లెట్‌‌ అత్యంత అగ్గువ ధ‌ర‌ద‌ని ముంబై కేంద్రంగా పనిచేసే గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌ కేంద్రానికి తెలిపింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం మిగతా క‌రోనా‌ మందులతో పోల్చుకుంటే ఫాబిఫ్లూకు తక్కువ‌ ధర అని గ్లెన్‌మార్క్ వెల్ల‌డించింది. ఇతర క‌రోనా ఔష‌ధాలు రెమ్‌డిసివిర్‌‌, టాసిలీజుమాబ్‌, ఇతోలిజుమాబ్‌ ధరలు ఫాబిఫ్లూ కంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికమని కంపెనీ వివ‌రించింది. ఫాబిఫ్లూ ధరలు, దాని పనితీరుపై కొన్ని విమర్శలు రావడంతో కేంద్రం గ్లెన్‌మార్క్‌ను వివరణ కోరగా ఈ మేరకు సదరు ఫార్మా కంపెనీ వివ‌ర‌ణ ఇచ్చింది. 

గ్లెన్‌మార్క్‌ గత నెలలో యాంటీ వైరల్ ఔష‌ధం ఫవిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. రూ.103కు ఒకటి చొప్పున ట్యాబ్లెట్‌ ధర నిర్ణయించింది. క‌రోనా‌ నుంచి కోలుకునేందుకు రెండు వారాలపాటు ఈ మెడిసిన్‌ వాడాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. అయితే, ఫవిపిరవిర్‌ శ్వాససంబంధ వ్యాధులున్న క‌రోనా‌ బాధితులపై సరిగా పనిచేయడం లేదని ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో వివరణ ఇవ్వాలని కేంద్రం గ్లెన్‌మార్క్‌‌కు నోటీసులు పంపింది. కాగా, గత వారం గ్లెన్‌మార్క్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ ధ‌ర‌ను 27 శాతం తగ్గించింది. దాంతో ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.75కు త‌గ్గింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo