ఆదివారం 12 జూలై 2020
National - Jun 20, 2020 , 16:16:09

కళ్లు ఎర్రబారినా వైరస్‌ సంకేతమే.!

కళ్లు ఎర్రబారినా వైరస్‌ సంకేతమే.!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తకొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. తొలుత జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం వంటి వాటిని లక్షణాలుగా పేర్కొన్నారు వైద్యులు. ఇటీవల రుచి, సువాసన తెలియక పోవడం కూడా కరోనా లక్షణమేనని తెలిపింది ఆరోగ్య శాఖ. ఇవి కాక కొవి‌డ్‌-19కు సంబంధించి మరో కొత్త లక్షణం కూడా ఉందట.

కళ్లు ఎర్రబారడం కూడా కరోనా వైరస్‌ సోకేందుకు సంకేంతమే అంటున్నారు కెనడాలోని అల్జెర్బా విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫేసర్‌ కార్లోస్‌ సోలర్టె. కంటి సమస్యతో బాధపడుతూ ఓ మహిళ తమ వద్దకు వచ్చిందని, ముందు అది కంటి సమస్య అనుకున్నా.. తర్వాత కరోనా కేసుగా తేలిందని చెప్పారు. కరోనా రోగుల్లో ఎక్కువగా సెంకెడరీ లక్షణంగా కళ్లు ఎర్ర బారడమూ, కండ్ల కలక వంటివి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కంటి సమస్య ఉన్న వారిని కొవిడ్‌ పరీక్షలకు సిఫారసు చేయడం మంచిదని సూచించారు. logo