శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 09:34:36

తీవ్ర వేదనకు గురయ్యా.. రైలు ప్రమాదంపై పీఎం మోదీ

తీవ్ర వేదనకు గురయ్యా.. రైలు ప్రమాదంపై పీఎం మోదీ

ఢిల్లీ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. 16 మంది వలస కార్మికులు మృతిచెందడంపై తీవ్ర వేదనకు గురైనట్లు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ... ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడినట్లు తెలిపారు. పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా తెలిపినట్లు చెప్పారు. కావాల్సిన అన్ని సహాయ, సహకారాలను అందించనున్నట్లు వెల్లడించారు. ట్రాక్‌పై నిద్రపోతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. 


logo