శనివారం 16 జనవరి 2021
National - Dec 31, 2020 , 01:51:57

ఇస్రో చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

ఇస్రో చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

బెంగళూరు: ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం పొడిగింపునకు కేంద్ర నియామకాల కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. శివన్‌ ఈ పదవిలో 2022 జనవరి 14దాకా కొనసాగుతారు. 2018 జనవరి 14న ఆయన ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.