బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 19:05:09

ఆన్ లైన్ వ్యాస రచన పోటీలకు గడువు పొడిగింపు

ఆన్ లైన్ వ్యాస రచన పోటీలకు గడువు పొడిగింపు

ఢిల్లీ : దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మై గవ్ తో కలిసి ఆన్ లైన్ వ్యాస రచన పోటీలునిర్వహించేందుకు సిద్ధమైంది. 9,10 తరగతులకు సెకండరీ విభాగం కింద 11,12 తరగతులకు హయ్యర్ సెకండరీ విభాగం కింద దేశవ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతాయి. అయితే ముందుగా ప్రకటించినవిధంగా కాకుండా విద్యార్థులు ఈ నెల 23 వరకు వ్యాసాలు పంపడానికి వెసులుబాటు కల్పించింది. ఈ ఈవెంట్ కు ఎన్ సి ఇ ఆర్ టి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది.

" ఆత్మ నిర్భర్ భారత్ - స్వతంత్ర భారత్ " అనే ప్రధాన అంశానికి తోడుగా ఈ క్రింది సబ్ టాపిక్ లను ఎంచుకోవచ్చు

1. ఆత్మ నిర్భర్ భారత్ కు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రధాన మూల స్తంభాలు

2. 75 ఏండ్ల భారత్: ఆత్మ నిర్భర్ భారత్ వైపు దూసుకెళుతున్న జాతి  

3. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ : భిన్నత్వంలో ఏకత్వం ద్వారా నవకల్పనలకు ఊతం

4. డిజిటల్ ఇండియా: కోవిడ్ 19  లోనూ, ఆ తరువాత అవకాశాలు

5.  ఆత్మ నిర్భర్ భారత్ - దేసాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర  

6. ఆత్మ నిర్భర్ భారత్ - లింగభేదం, కులం, ప్రాంతీయ వివక్షతల నుంచి విముక్తి 

7. ఆత్మ నిర్భర్ భారత్ : జీవ వైవిధ్యం, వ్యవసాయ సంపద ద్వారా సరికొత్త భారతావని సృష్టి

8. నా హక్కులు వాడుకుంటూ ...నా బాధ్యతలు నెరవేర్చినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ సాకారమవుతుంది.

9. నా శారీరక దృఢత్వమే నా సంపద. అదే ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి  మానవ మూలధనం

10. ఆత్మ నిర్భర్ భారత్ కోసం పచ్చదనానికి పెద్ద పీట

విద్యార్థులు తమ ఎంట్రీలను ఆగస్టు 23లోగా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు : https://innovate.mygov.in/essay-competition చూడొచ్చు. 

తాజావార్తలు


logo