బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 17:17:19

విదేశీ ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ గడువు పెంపు

విదేశీ ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ గడువు పెంపు

ఢిల్లీ : కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన 'పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం' (డీపీఐఐటీ), ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ ఆదేశాన్ని 2020 ఫిబ్రవరి 25 న జారీ చేసింది.సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే    పారిశ్రామిక సంఘాల విజ్ఞప్తి మేరకు దీనిని 2021 జనవరి 1వ తేదీ వరకు పొడిగించారు. విదేశీ బొమ్మల నాణ్యత 'ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ సేఫ్టీ ఆఫ్‌ టాయ్స్' ప్రకారం ఉండాలి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)నిబంధనలు‌-2018లోని షెడ్యూల్‌-IIలోని స్కీమ్‌-I ప్రకారం తీసుకున్న లైసెన్స్‌ కింద బీఐఎస్ ప్రామాణిక ముద్రను అవి కలిగివుండాలి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ), 02.12.2019న, 33/2015-2020 నంబరు ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం, బొమ్మలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే, కన్‌సైన్‌మెంట్లలో ర్యాండమ్‌గా నమూనా పరీక్ష, అనుమతి తప్పనిసరి. విదేశీ లైసెన్సుదారుల బొమ్మల దిగుమతుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షించడానికి అధికారుల నియామకం జరిగింది. దీనికి సంబంధించిన 'ప్రామాణిక కార్యాచరణ‌' కస్టమ్స్‌ విభాగానికీ అందింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo