గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 15:55:19

బెంగళూరులో మ‌రో వారం లాక్‌డౌన్‌

బెంగళూరులో మ‌రో వారం లాక్‌డౌన్‌

బెంగ‌ళూరు: క‌రోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు న‌గ‌రపాల‌క సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. లాక్‌డౌన్‌ను మ‌రో వారంపాటు పొడిగించాలని డిసైడ్ చేసింది. స‌డ‌లింపుల త‌ర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగ‌డంతో బెంగ‌ళూరులో జూలై 14 నుంచి 23 వ‌ర‌కు క‌ఠిన లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చారు. అయినా కేసుల సంఖ్య‌లో ఏ మాత్రం త‌గ్గుద‌ల క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌రో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ విషయాన్ని బెంగ‌ళూరు మేయ‌ర్ గౌతంకుమార్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న పంపిన‌ట్లు గౌతంకుమార్‌ తెలిపారు. న‌గ‌రంలో 2,000 కంటే ఎక్కువ కేసులు న‌మోదైన‌ హాట్‌స్పాట్‌లు, కంటైన్మెంట్ జోన్‌ల‌లో యాంటీజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మేయ‌ర్ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo