గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 11:11:03

కరోనా భయం.. 20 నిమిషాల పాటు రైలు నిలిపివేత

కరోనా భయం.. 20 నిమిషాల పాటు రైలు నిలిపివేత

లక్నో : దేశంలోని ప్రతి ఒక్కరిని కరోనా భయం వెంటాడుతోంది. రద్దీ ఉండే ప్రాంతాల్లోకి వెళ్లడానికి జనాలు జంకుతున్నారు. కరోనా వైరస్‌ భయంతో మెజార్టీ ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే న్యూఢిల్లీ నుంచి దిబ్రుగర్హ్‌ వెళ్తున్న రైల్లో ఓ ఇద్దరు విదేశస్తులు తీవ్రంగా దగ్గుతున్నారు.

దీంతో మిగతా ప్రయాణికులు అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఆ ఇద్దరు విదేశస్తులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. సాధారణ దగ్గుగానే వైద్యులు తేల్చారు. విదేశస్తులకు కరోనా లేదని తేలడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 125కి చేరింది. మొత్తం ముగ్గురు మృతి చెందారు. 


logo