శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 08:59:13

పుల్వామా దాడి.. పేలుడుప‌దార్ధాలు కొన్న‌ది ఆన్‌లైన్‌లోనే

పుల్వామా దాడి.. పేలుడుప‌దార్ధాలు కొన్న‌ది ఆన్‌లైన్‌లోనే

హైద‌రాబాద్‌: పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో సుమారు 40 మంది జ‌వాన్లు చ‌నిపోయిన‌ విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడికి పాల్ప‌డిన జేషే ఉగ్ర‌వాది షాకిర్‌ బాషిర్ మాగ్రేను .. శుక్ర‌వారం రోజున ఎన్ఐఏ పోలీసులు కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు.  షాకిర్ బాషిర్ విచార‌ణ‌లో అనేక సంచ‌ల‌నాత్మ‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పుల్వామా దాడికి కావాల్సిన పేలుడు ప‌దార్ధాల‌ను షాకిర్ ఆన్‌లైన్‌లోనే ఖ‌రీదు చేశాడ‌ట. ఐఈడీ బాంబు త‌యారీ కోసం అమోనియం నైట్రేట్‌, నైట్రో గ్లిజ‌రిన్‌, ఆర్డీఎక్స్ లాంటి ప‌దార్ధాల‌ను ఆన్‌లైన్‌లో కొన్న‌ట్లు షాకిర్ విచార‌ణ‌లో చెప్పాడు. బ్యాట‌రీని, అమోనియం నైట్రేట్‌ను ఓ పోర్టల్ ద్వారా ఖ‌రీదు చేసిన‌ట్లు క్లారిటీ ఇచ్చాడు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను పేల్చేందుకు తీసుకు వ‌చ్చిన మారుతీ ఎకో కారును కూడా దాడి ప్రాంతానికి 500 మీట‌ర్ల దూరం వ‌ర‌కు షాకిరే డ్రైవ్ చేశాడు.  ఆ త‌ర్వాతే అదిల్ అహ్మ‌ద్ దార్ ఆ కారుతో జ‌వాన్ల వాహ‌నాన్ని ఢీకొట్టాడు.  ఇద్ద‌రు జేషే ఉగ్ర‌వాదుల‌కు 2018లో ఆశ్ర‌యం క‌ల్పించిన‌ట్లు అత‌ను చెప్పాడు. పుల్వామా దాడిలో పాక్‌కు చెందిన ఉమ‌ర్ ఫారూక్‌, క‌మ్రాన్‌లు కూడా కుట్ర ప‌న్నిన‌ట్లు విచార‌ణ‌లో తేల్చారు. సుమారు 80 కేజీల ఆర్డీఎక్స్‌తో దాడికి పాల్ప‌డ్డారు. పాక్‌లో ఖ‌రీదు చేసిన ఆ పేలుడు ప‌దార్ధాల‌ను ఎల్వోసీ రూట్లో ఇండియాకు తీసుకువ‌చ్చాడు.  


logo