శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 06:48:04

ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొని!

ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొని!

న్యూఢిల్లీ : వడ్డీ, డివిడెండ్‌, అద్దె వంటి వేతనేతర చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌/టీసీఎస్‌ను కేంద్ర ప్రభుత్వం 25 శాతం మేర తగ్గించింది. దీని ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులు, మ్యూచువల్‌ ఫండ్‌లు, షేర్ల ద్వారా డివిడెండ్‌ పొందేవారు, అద్దెల ద్వారా ఆదాయం పొందే యజమానుల చేతుల్లో లిక్విడిటీ పెరుగనుంది. అయితే టీడీఎస్‌/టీసీఎస్‌ తగ్గింపు మూలాన వీరి పన్ను చెల్లింపులో మాత్రం తగ్గింపు ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఐటీ శ్లాబులను అనుసరించి వీరు మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. అంటే, టీడీఎస్‌ తగ్గింపు ద్వారా పొందిన మొత్తాన్ని తిరిగి స్వీయ అంచనా పన్ను (సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌) రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ స్వీయ అంచనా పన్ను నిర్దిష్ట పరిమితి దాటితే, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించవలసి ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణకు ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై చెల్లించే రూ.50,000 వడ్డీకి బ్యాంక్‌ 10 శాతం టీడీఎస్‌ కింద రూ.5000 డిడక్ట్‌ చేస్తే.. రేట్ల తగ్గింపు వల్ల టీడీఎస్‌ 7.5 శాతానికి తగ్గుతుంది. దీంతో డిడక్ట్‌చేసే మొత్తం 3,750కి తగ్గుతుంది. దీని వల్ల చేతిలోకి అధిక మొత్తం వస్తుంది. పై ఉదాహరణను అనుసరించి, టీడీఎస్‌ తర్వాత వచ్చే వడ్డీ ఆదాయం రూ.46,250. అయితే దీని వల్ల వడ్డీ ఆదాయంపై  చెల్లించే టాక్స్‌లో మాత్రం మార్పుండదు. పైగా అధిక పన్ను చెల్లించాల్సి రావచ్చు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నారనుకుంటే,  10 శాతం టీడీఎస్‌ పోను 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే టీడీఎస్‌ రేటు తగ్గడం వల్ల స్వీయ అంచనా పన్ను చెల్లించే సమయంలో 22.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. 


logo