శనివారం 28 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 15:59:36

‘ప్రయోగాత్మకంగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ప్రారంభం’

‘ప్రయోగాత్మకంగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ప్రారంభం’

తిరుపతి :  తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర స్వామివారి ఆల‌యంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ‌ల‌ను భ‌క్తుల కోరిక మేర‌కు ప్రయోగాత్మకంగా ఆదివారం నుంచి టీటీడీ ప్రారంభించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్‌-19 మార్గదర్శకాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, స‌హ‌స్ర ‌దీపాలంకార‌ సేవా టికెట్లను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవ‌గా న‌వంబ‌రె రెండో వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ చర్యలు చేప‌ట్టింది. ఈ సేవ‌లు పొందిన భ‌క్తులకు ఆ టికెట్టుపై శ్రీ‌వారి దర్శనం ఉండ‌దు. దర్శనం పొంద దలచిన గృహ‌స్తులు శ్రీ‌వారి దర్శనం కోసం ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైలో పొందాల్సి ఉంటుంది. ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు.