గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 17:29:49

రూ. 500 కోట్లతో ఆపరేషన్‌ గ్రీన్‌ విస్తరణ

రూ. 500 కోట్లతో ఆపరేషన్‌ గ్రీన్‌ విస్తరణ

ఢిల్లీ : రూ. 500 కోట్లతో ఆపరేషన్‌ గ్రీన్‌ విస్తరణను చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది. టమాటో, ఉల్లిపాయాలు, బంగాళాదుంపలకే పరిమితమైన ఆపరేషన్‌ గ్రీన్‌ను ఇకపై అన్ని కూరగాయలు, పండ్లకు విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3 వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రకటించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఊతానికి మంత్రి నేడు ప్యాకేజీని ప్రకటించారు. ఈ క్రమంలో భాగంగా ఆపరేషన్‌ గ్రీన్‌ను విస్తరించింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల వస్తువుల సరఫరా చైన్‌కు ఆటంకం తలెత్తిందన్నారు. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరల తగ్గుదల, అమ్ముడుపోవడం లేదన్న బాధను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ స్కీం కింద వివిధ మార్కెట్లకు తరలించే నిమిత్తం రవాణపై 50 శాతం సబ్సిడి కల్పిస్తున్నట్లు తెలిపారు. నిల్వ చేసుకునేందుకు శీతల గోదాముల్లో నిల్వపై సహా 50 శాతం సబ్సిడీని కల్పిస్తున్నామన్నారు. రైతులకు మంచి ధరలు దక్కేలా చూడటం, వ్యర్థాలు తగ్గించడం అదేవిధంగా వినియోగదారులకు అందుబాటు ధరలో లభించేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. 


logo