మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 21:03:46

విశాఖ గ్యాస్ బాధితుల‌కు ప‌రిహారం విడుద‌ల‌

విశాఖ గ్యాస్ బాధితుల‌కు ప‌రిహారం విడుద‌ల‌

అమరావతి: విశాఖప‌ట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో చోటుచేసుకున్న గ్యాస్ ప్ర‌మాద‌ బాధితులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. రూ.30 కోట్ల నిధుల‌ను విడుదల చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితుల‌కు రూ.10 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నారు. ప్రథమ చికిత్స పొందిన వారికి రూ.25 వేలు, ఎల్జీ కంపెనీ పరిసర గ్రామాల్లో ఉన్న వారికి రూ.10 వేల చొప్పున సాయం అందించనున్నారు. 
logo