శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 12:42:47

మాస్క్‌తో ఎక్సర్‌సైజ్ చేస్తే అంతే సంగతులు

మాస్క్‌తో ఎక్సర్‌సైజ్ చేస్తే అంతే సంగతులు

హైదరాబాద్: కరోనా నుంచి రక్షణ పందాలంటే మాస్క్ తప్పనిసరి అని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ మాస్క్ ఎల్లవేళలా పనికిరాదు. ఇతరులు హైదరాబాద్: కరోనా నుంచి రక్షణ పందాలంటే మాస్క్ తప్పనిసరి అని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ మాస్క్ ఎల్లవేళలా పనికిరాదు. ఇతరులు దగ్గరగా వచ్చినప్పుడు మాస్క్ ఉంటే రక్షణ కవచమే. మాస్క్ పెట్టుకుంటే కానీ ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు మాస్క్ ఏమాత్రం మంచిది కాదని వైద్యులు అంటున్నారు. మాస్క్ పెట్టుకున్నప్పుడు మనం వదిలిన గాలినే మళ్లీ పీల్చుకోవడం జరుగుతుంది. మామూలుగానే ఇది అంత మంచిది కాదు. ఇక ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు అస్సలు పనికిరాదు. అందుకు కారణాలు ఇప్పుడు చూద్దాం..

1.ఊపిరి ఆడకపోవడం ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు మనం అధికంగా ఊపిరి తీసుకుంటాం. కానీ మాస్క్ ఉంటే గాలి సరఫరా తగ్గిపోయి ఊపిరి ఆడదు. ఇది చాలా ప్రమాదకరం.

2. సత్తువ తగ్గి అలసట రావడం సత్తువ అంటే మరేమీ కాదు ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు మనం పీల్చుకునే ఆక్సిజనే. మాస్క్ ఉంటే పీల్చే ఆక్సిజన్ తగ్గిపోయి నిస్సత్తువ వస్తుంది.

3. తల తిప్పడం ఆక్సిజన్ తగ్గిపోయి ఊపిరాడని పరిస్థితిలో సహజంగానే తలతిప్పడం, తూలుతున్నట్టుగా అనిపించడం వంటివి వస్తాయి.

4. అధిక చెమట, నీరు తగ్గిపోవడం వదిలిన గాలినే మళ్లీమళ్లీ పీల్చడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల చెమట ఎక్కువ పడుతుంది. ఫలితంగా శరీరంలో నరు తగ్గిపోతుంది.

5. స్పృహ తప్పడం, చిరాకు చిరాకుగా అనిపించవచ్చు. స్పృహ తప్పడం కూడా జరగవచ్చు. మాస్క్ పెట్టుకుని ఎక్సర్‌సైజ్ చేస్తే శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. దీనివల్లే స్పృహ తప్పే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంటిపట్టున ఉండి బాల్కనీలోనో, టెర్రస్ మీదనో మాస్క్ లేకుండా (సమీపంలో ఎవరూ లేనట్టయితే) ఎక్సర్ సైజ్ చేసుకోవడం బెటర్. ఎన్-95 మాస్కులైతే కొంత నయమే కానీ అవి మామూలు మనుషుల కన్నా వైద్యులకే ఎక్కువ అవసరం. కోవిడ్-19తో సహజీవనం సాగించక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. కనుక ఎంపికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మాస్క్ పెట్టుకుని బయటకు జాగింగ్ వెళ్లే ముందు ఓసారి ఆలోచించండి.


logo