ఆదివారం 24 జనవరి 2021
National - Jan 11, 2021 , 18:24:21

సినిమా థియేటర్ల యజమానులకు శుభవార్త!

సినిమా థియేటర్ల యజమానులకు శుభవార్త!

తిరువనంతపురం: సినిమా థియేటర్ల యజమానులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు నెలల పాటు వినోద పన్ను వసూలు చేయబోమని తెలిపింది. 2021 జనవరి నుండి మార్చి వరకు వినోద పన్ను నుంచి సినిమా థియేటర్లకు మినహాయింపు ఇచ్చినట్లు కేరళ సిఎం పినరయి విజయన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో థియేటర్లను మూసివేసిన పది నెలలకు స్థిర విద్యుత్ చార్జీలు 50 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. అలాగే వివిధ లైసెన్సుల చెల్లుబాటును కూడా పొడిగించినట్లు పినరయి విజయన్ పేర్కొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo