బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 12:34:23

ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ అమలు తేదీ గడువు పొడిగింపు

 ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ అమలు తేదీ గడువు పొడిగింపు

ఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ), ఆట వస్తువుల అమలు నాణ్యత నియంత్రణ గడువును పొడిగించింది. తొలుత సెప్టెంబర్ 1వతేదీ 2020 వరకు ఉన్న అమలు తేదీని జనవరి 1వ తేదీ 2021 వరకు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. గడువు పెంపు వల్ల... కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి, వస్తువుల తయారీలో ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి దేశీయ తయారీదారులకు మరో 4 నెలల అదనపు సమయం దొరుకుతుంది. ఈ సమయాన్ని ఆటవస్తువులు తయారీ సంస్థలు సద్వినియోగించుకోవాలని డీపీఐఐటీ కోరింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

  


logo