సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 13:06:56

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు

హైద‌రాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై లీట‌రుకు మూడు రూపాయాల చొప్పున ఎక్సైజ్ సుంకాన్నికేంద్ర ప్ర‌భుత్వం పెంచింది. అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో.. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. లీట‌రు పెట్రోల్‌పై ప్ర‌త్యేక సుంకాన్ని రూ.2 నుంచి రూ.8 వ‌ర‌కు, డీజిల్‌పై నాలుగు రూపాయ‌ల‌ను పెంచారు. పెట్రోల్‌పై రోడ్డు సుంకాన్ని కూడా లీట‌రుకు రూపాయి, డీజిల్‌పై ప‌ది రూపాయ‌ల‌కు పెంచారు. ఎక్సైజ్ సుంకాన్ని పెంచ‌డం వ‌ల్ల సాధార‌ణంగా ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే అంత‌ర్జాతీయ ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్ల‌.. వినియోగ‌దారుల‌పై ఆ ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు లేవు.logo