గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 06:44:47

ఎక్సైజ్‌ సుంకం 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంపు

ఎక్సైజ్‌ సుంకం 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంపు

ఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో నవంబర్‌ 2014, జనవరి 2016 మధ్య  బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచింది. ఈ 15 మాసాల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్‌ సుంకం పెరిగింది. దీంతో 2016-17లో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,42,000 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, పెట్రోల్‌, డీజిల్‌పై  కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంపై కాంగ్రెస్‌ మండిపడింది. పెంపు పేరుతో సర్కారు సామాన్యులను లూటీ చేస్తున్నదని ఆరోపించింది. లీటర్‌ పెట్రోల్‌పై స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 నుంచి రూ.8కి, డీజిల్‌పై రూ.4కు పెంచారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌పై రోడ్డు సెస్సును లీటరుకు రూ.1 పెంచారు. దీంతో ఈ సెస్సు రూ.10కి చేరింది. తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్‌ సుంకం రూ.22.98కు, డీజిల్‌పై రూ.18.83కు పెరిగింది.


logo