గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 19:31:37

పంజాబ్‌లో ఎగ్జిట్‌ క్లాస్‌ పరీక్షలు వాయిదా

పంజాబ్‌లో ఎగ్జిట్‌ క్లాస్‌ పరీక్షలు వాయిదా

ఛండీఘడ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలోని అన్నియూనివర్సిటీల ఎగ్జిట్‌ క్లాస్‌ పరీక్షలను జూన్‌ 15వరకు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేందర్‌సింగ్‌ ఆదివారం ప్రకటించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే విషయమై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తుది నిర్ణయం తీసుకొని కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుందని ఆశిస్తున్నామని సీఎం కార్యాలయం పేర్కొంది.

ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 28,859కి చేరింది. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 19,906 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,03,051 యాక్టివ్‌ కేసులున్నాయని, 3,09,713మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జికాగా 16905 మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


logo