గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 22:30:50

ఇంటి వద్ద నుంచే మూల్యాంకనం

ఇంటి వద్ద నుంచే మూల్యాంకనం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బోర్డు పరీక్షల మూల్యాంకన మార్గదర్శకాల్లో మార్పులు చేసినట్టు కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌ (ఐసీఎస్‌ఈ)  ప్రకటించింది. ఎగ్జామినర్లు ఇంటి వద్దే జవాబు పత్రాలను దిద్దుతారని తెలిపింది. తమ నివాసాల వద్ద నిర్దేశించిన సమయంలోగా విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారని ఐసీఎస్‌ఈ కార్యదర్శి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జెర్రీ అరాథూన్‌ తెలిపారు. చీఫ్‌ ఎగ్జామినర్‌, కో చీఫ్‌ ఎగ్జామినర్‌, ఎగ్జామినర్‌ కోఆర్డినేటర్లతో తొలిరోజుకొద్దిసేపు సమావేశం నిర్వహించి మూల్యాంకనంలో తీసుకోవాల్సిన తప్పనిసరి చర్యలు, సూచనలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం వారికి జవాబు పత్రాలను అందజేస్తామని వెల్లడించారు.


logo