బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:47:45

దీపికా ప‌దుకొనేపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

దీపికా ప‌దుకొనేపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ముంబై: బాలీవుడ్ ప‌్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనేపై రిసెర్చ్ అండ్ ఎనాల‌సిస్ వింగ్ (RAW) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అనీల్ ముసార‌త్ సూచ‌న మేరకే ఆమె ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జేఎన్‌యూను సంద‌ర్శించి, అక్క‌డ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారని చెప్పారు. అందుకుగాను దీపికా ప‌దుకొనేకు ముసార‌త్ రూ.5 కోట్లు ముట్ట‌జెప్పార‌ని ఆరోపించారు. అనీల్ ముసార‌త్‌కు పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు. 

ఈ ఏడాది జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ)లో మోదీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ముఖాల‌కు ముసుగులు ధ‌రించి వెళ్లిన కొంద‌రు దుండ‌గులు విద్యార్థుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో దాదాపు 30 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఆ సంద‌ర్భంలో దీపికా ప‌దుకొనే జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం ప్ర‌క‌టించారు.                     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo