నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.తమ్ముడిపై అన్నకు ఎంత ప్రేమ ఉందో, తమ్ముడికి కూడా అన్నఅంటే అంతే ప్రేమ ఉంటుంది. దాదాపు ఎన్టీఆర్ సినిమాలన్నింటిని కళ్యాణ్ రామ్ తన సొంత బేనర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తుంటాడు. ఇదే వారిద్దరి మధ్య ఉన్న ఘాడమైన అనుబంధం గుర్తు చేస్తుంది. అయితే అన్నదమ్ములే కాదు వారి సతీమణులు కూడా చాలా అనుబంధంతో ఉంటారు.
తాజాగా ఎన్టీఆర్ భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కలిసి దిగిన ఫొటో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్లా అన్నట్టు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్ నందమూరి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని (యువసుధ బ్యానర్) తో కలిసి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మిస్తున్నారు. అలానే తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాని హరిక సంస్థ భాగస్వామ్యంలో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తారు.